మాస్టర్ ప్లాన్ జీవో విడుదల.. అభివృద్ది పరుగులు పెట్టేనా ?
చిత్తూరు: పలమనేరు మున్సిపల్ మాస్టర్ ప్లాన్ అమలుకు ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన జీవో నెం.277 తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో అమరనాథ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రత్యేక చొరవ చూపారు. కానీ ఎన్నికలు ఇతరత్రా కారణాలతో వాయిదా పడింది. రాబోయే 20 సంవత్సరాల పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.