అధికారుల వైఫల్యం.. నిలిచిన గ్రామోత్సవం
KRNL: శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అధికారుల సమన్వయ లోపం భక్తులకు శాపంగా మారింది. రద్దీని నియంత్రించడంలో యంత్రాంగం విఫలమైంది. గంటల తరబడి క్యూలైన్లలో ఆహారం లేక భక్తులు అలమటించారు. అసహనానికి గురై క్యూలైన్ల మెష్లు విరగ్గొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్వామి గ్రామోత్సవం నిలిచిపోయింది.