‘ఆ దీపావళిని ఎప్పటికీ మర్చిపోలేను’

‘ఆ దీపావళిని ఎప్పటికీ మర్చిపోలేను’

నేవీ డే సందర్భంగా ప్రధాని మోదీ నావికాదళానికి శుభాకాంక్షలు తెలిపారు. భారత నేవీ అంటేనే అసాధారణ ధైర్యం, తెగువకు మారుపేరని కొనియాడారు. నావికాదళం దేశ తీరాలను రక్షిస్తూ మన భద్రతను పెంచుతోందని ప్రశంసించారు. ఇటీవల స్వయం సమృద్ధి, ఆధునీకరణపై నేవీ ఫోకస్ పెట్టిందని చెప్పారు. ఈసారి దీపావళిని INS విక్రాంత్‌పై జవాన్లతో జరుపుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని మోదీ గుర్తుచేసుకున్నారు.