మైనర్ బాలిక సూసైడ్ ఘటన పై DSP క్లారిటీ

మైనర్ బాలిక సూసైడ్ ఘటన పై DSP క్లారిటీ

సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన మైనర్ బాలిక వేధింపుల ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదన్న ఆరోపణలపై ధర్మవరం డీఎస్పీ హేమంత్ స్పష్టత ఇచ్చారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే చట్ట ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. బాలిక ఆత్మహత్యాయత్నం చేసి మృతి చెందడం బాధాకరమని డీఎస్పీ విచారం వ్యక్తం చేశారు. నిజానిజాలు వెలికితీసేందుకు విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.