లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి అరెస్ట్

SRD: ఎనిమిది సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు కలిం పాషాను అరెస్టు చేసినట్లు సంగారెడ్డి రూరల్ సి.ఎస్.ఐ రవీందర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మరొక నిందితున్ని ముందే అరెస్టు చేసినట్లు తెలిపారు. దాడికి గురైన బాలికను సంగారెడ్డిలోని సఖి కేంద్రానికి తరలించినట్లు చెప్పారు.