ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కడప: తొండూరు ఐటీఐ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అడ్మిషన్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటరెడ్డి తెలిపారు. ఈనెల 24లోపు ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న పదో తరగతి విద్యార్థులు అప్లికేషన్, సర్టిఫికెట్లను కళాశాలలో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.