'శాస్త్రీయ విద్యా విధానాన్ని అవలంబించాలి'
ADB: శాస్త్రీయ విద్యా విధానాన్ని అవలంబించాలని విద్యావ్యవస్థలో సమూల మార్పులపై ఉద్యమించిన గొప్ప నాయకుడు జార్జ్ రెడ్డి అని PDSU జిల్లా అధ్యక్షురాలు దీపాలక్ష్మీ అన్నారు. ఈ నెల 14 వరకు నిర్వహించనున్న జార్జి రెడ్డి వర్ధంతి కార్యక్రమం గోడప్రతులను ఉట్నూర్ లో శుక్రవారం ఆవిష్కరించారు. పెత్తందారి, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడని కొనియాడారు.