33 సార్లు రక్తదానం చేసిన వ్యక్తి

33 సార్లు రక్తదానం చేసిన వ్యక్తి

KMR: జిల్లాలోని బిక్కనూర్ మండలం కాచాపూర్‌కు చెందిన శ్రావణ్ కుమార్ 33 సార్లు రక్తదానం చేశారు. బుధవారం సాయంత్రం కామారెడ్డిలోని బ్లడ్ కేంద్రంలో ఆయన రక్తదానం చేశారు. ఆపద సమయంలో రక్తం అవసరం ఉన్నవారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఆరు నెలలకు రక్తదానం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పలువురు అభినందనలు తెలిపారు.