VIDEO: అక్రమంగా తరలిస్తున్న క్రూడాయిల్ పట్టివేత
కోనసీమ: రాజోలు మండలం తాటిపాకలో శుక్రవారం రాత్రి ట్యాంకర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న క్రూడాయిల్‌ను పోలీసులు పట్టుకున్నారు. రెండో రకం క్రూడాయిల్‌ను తాటిపాక మఠానికి చెందిన ఒక ఆయిల్ వ్యాపారి దిగుమతి చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. ట్యాంకర్‌లో సుమారు 24 వేల లీటర్లు క్రూడాయిల్ ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.