పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి స్వామి
ప్రకాశం: టంగుటూరు మండలంలోని శివపురంలో సోమవారం కొండేపి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పెన్షన్లు పంపిణీ చేశారు. ఆయన ఇంటింటికి తిరిగి లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పెన్షన్ పంపిణీ ఆగడం లేదన్నారు. పేదరికంలేని సమాజమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.