నేడు నూతన సర్పంచులకు అవగాహన సదస్సు
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికార ఫంక్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నేడు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ప్రజాపాలనలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సర్పంచులకు వివరించనున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించనున్నారు.