109 వసంతంలోకి అడుగుపెట్టిన లూధరన్ చర్చి
BPT: చీరాలలోని సెయింట్ మార్క్స్ లూధరన్ చర్చి 109 సంవత్సరంలోకి అడిగుపెట్టినట్లు నిర్వాహక కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఈ చర్చి నిర్మాణం 1916 లో జరిగిందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఈ చర్చికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని వారు తెలియజేశారు. నూతన సంవత్సరం వరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయన్నారు.