డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం
మధ్యప్రదేశ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గంజాయి కేసులో ఆ రాష్ట్ర మంత్రి ప్రతిమా సోదరుడు అనిల్ బగ్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పంకజ్ సింగ్ అనే మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.9.22 లక్షల విలువైన 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో వ్యక్తి పరారీలో ఉండగా.. గాలిస్తున్నారు.