నూతన పంచాయతీ కార్యాలయానికి భూమి పూజ
E.G: దేవరపల్లి(మం) కృష్ణంపాలెం పంచాయితీ కార్యాలయం శిధిలా వ్యవస్థలో ఉంది. ఈ నేపథ్యంలో నూతన కార్యాలయానికి కృష్ణంపాలెం గ్రామ సర్పంచ్ నాయుడు దుర్గాప్రసాద్ దంపతులు కలిసి శనివారం భూమి పూజ చేశారు. రూ. 32 లక్షలతో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఈ నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకి ధన్యవాదాలు చెప్పారు.