తవణంపల్లిలో పెద్దపులి ప్రచారం అవాస్తవం: ఎస్సై

తవణంపల్లిలో పెద్దపులి ప్రచారం అవాస్తవం: ఎస్సై

CTR: తవణంపల్లి మండలం మాధవరం రహదారిలో బ్రిడ్జి వద్ద పెద్దపులి రోడ్డు దాటిందని సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో ఫేక్ ప్రచారం జరుగుతోందని ఎస్సై చిరంజీవి తెలిపారు. ఇది పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అపోహలు నమ్మవద్దని, ఇలాంటి ఫేక్ వార్తలు పంచే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.