VIDEO: చౌటపల్లి సొసైటీకి యూరియా కోసం రైతుల పడిగాపులు

WGL: పర్వతగిరి మండలం చౌటపల్లి సొసైటీకి యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుధవారం యూరియా బస్తాలు తీసుకోవడానికి గాను అధికారులు టోకెన్లను ఇస్తున్నారు. రైతులు భారీగా సొసైటీకి తరలి రావడంతో తోపులాట జరిగింది. యూరియా కొరత రైతులకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది. అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు