హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్: తిరుపతి SP
తిరుపతి జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు మూడు దశల ప్రణాళికను అమల్లోకి తెచ్చామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుందన్నారు. జరిమానాలు కాదని.. ప్రాణ రక్షణే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అందరూ హెల్మెంట్ వాడాలని కోరారు. ఈనెల 15 నుంచి 'నో హెల్మెట్–నో పెట్రోల్' కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.