నేడు భువనగిరిలో నర్సింగ్ కాలేజ్ ప్రారంభం

BHNG: డిసెంబర్ 1నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఈనెల 2వ తేదీన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా నర్సింగ్ కాలేజీలను ప్రారంభించనున్నారు. జిల్లాకు సంబందించి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కళాశాల, ట్రాన్స్ జెండర్ క్లినిక్‌ల కార్యక్రమం పగిడిపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.