అమ్మవారి సేవలో బీజేపీ జిల్లా అధ్యక్షులు
SKLM: ఉగాది సందర్భంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గురువారం దర్శించుకున్నారు. ఈ మేరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది రోజున అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.