పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

MDK: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఒక వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. రామాయంపేట చెందిన విట్టల్ అనే వ్యక్తి మంగళవారం స్థానిక ఒక ప్రైవేటు వెంచర్లో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నారు. గమనించిన స్థానికులు మంటలు అదుపు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విట్టల్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.