దారుణం.. మూడేళ్ల కుమారుడి హత్య

దారుణం.. మూడేళ్ల కుమారుడి హత్య

AP: అనంతపురం జిల్లా శారదానగర్‌లో దారుణం జరిగింది. మూడేళ్ల కుమారుడిని గొంతు కోసి తల్లి అమూల్య హత్య చేసింది. అనంతరం ఆమె కూడా అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అమూల్యను రామగిరి డిప్యూటీ తహసీల్దార్ రవి భార్యగా గుర్తించారు. రెండ్రోజుల కిందట అమూల్య దంపతులు గొడవపడినట్లు స్థానికులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.