దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: సబ్‌కలెక్టర్
NZB: భూభారతిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో అన్నారు. పోతంగల్ తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాదాబైనామాలు, రెవెన్యూ సదస్సులోని దరఖాస్తులను, మండలంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.