జై షా చొరవతో ప్రతీక రావల్‌కు మెడల్
గాయం కారణంగా టీమిండియా వరల్డ్‌కప్ జట్టు నుంచి తప్పుకున్న ప్రతీక రావల్‌కు మెడల్ దక్కలేదు. దీంతో ఆమె నిరాశ వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, ఐసీసీ ఛైర్మన్ జై షా స్వయంగా తన కోసం మెడల్‌ను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రతీక వెల్లడించింది. అయితే, ఆ మెడల్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది.