F-35 ఫైటర్ జెట్‌పై దాడి.. ఎవరి వాదన నిజం?
అమెరికా, ఇరాన్ మధ్య పోరు ముదురుతోంది. అమెరికాకు చెందిన అత్యాధునిక F-35 ఫైటర్ జెట్‌ను టార్గెట్ చేసి కూల్చేశామని ఇరాన్(IRGC) ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఆ జెట్ పూర్తిగా ధ్వంసమైందని ఇరాన్ అంటుంటే, తమ విమానం క్షేమంగా ల్యాండ్ అయిందని అమెరికా కొట్టిపారేసింది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఇరు దేశాల మధ్య యుద్ధ జ్వాలలు మరింత రాజుకుంటున్నాయి.