52 లక్షలు మొక్కలు నాటడమే లక్ష్యం: కలెక్టర్
ASF: 2026 సంవత్సరంలో వన మహోత్సవంలో భాగంగా ASF జిల్లా వ్యాప్తంగా 52 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే వెల్లడించారు. ప్రతి గ్రామపంచాయతీలో లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచేందుకు కార్యచరణ రూపొందించామన్నారు. అవసరమైన మట్టి విత్తనాలు సేకరించాలని కలెక్టర్ సూచించారు.