'మా బాటలు సురక్షితంగా మారాలి'
VKB: జిల్లాలో గుంతలతో నిండిన రోడ్లు ప్రజల జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి. చెదిరిన ప్యాచ్‌లు, వర్షాలతో మరింత దారుణంగా మారిన మార్గాలు ప్రాణాలను తీస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిగి పర్యటనకు రానున్న సమయంలో రోడ్ల సమస్య పెద్ద పరీక్షగా మారింది. వృద్ధులు, విద్యార్థులు, రోగులు అందరి కోరిక ఒక్కటే మా బాటలు సురక్షితంగా మారాలని ప్రజలు కోరుతున్నారు.