మంత్రి నారాయణ అల్లుడికి సైబర్ ఎటాక్

AP: మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కంపెనీలో సైబర్ మోసం వెలుగు చూసింది. పునీత్ పేరుతో అకౌంటెంట్‌కు సైబర్ నేరగాళ్లు మెసేజ్ చేశారు. అత్యవసరంగా రూ.1.96 కోట్లు కావాలని మెసేజ్ పంపారు. దీంతో అకౌంటెంట్ వెంటనే డబ్బులు పంపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యూపీకి చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.