నెతన్యాహుపై మరోసారి AI పుకార్లు.. క్లారిటీ

నెతన్యాహుపై మరోసారి AI పుకార్లు.. క్లారిటీ

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ కేఫ్‌లో కాఫీ తాగుతున్న వీడియో AI సృష్టించినదని వస్తున్న ఆరోపణలపై క్లారిటీ వచ్చింది. ఆయన సందర్శించిన సతాఫ్ కేఫ్ యాజమాన్యం స్వయంగా ఆయన రాకను ధృవీకరిస్తూ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. గతంలో ఆయనకు 6 వేళ్లు ఉన్నాయని వచ్చిన AI ఎడిటెడ్ ఫొటోలను ఎగతాళి చేస్తూ, నిన్న విడుదల చేసిన వీడియోలో ఆయన తన చేతి వేళ్లను సరదాగా కెమెరాకు చూపించారు.