వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం

వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం

WNP: వీపనగండ్ల మండలం సంగినేనిపల్లి గ్రామంలో గుట్టల మధ్య స్వయంభూ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం ఉంది. ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయం బండలతో కూడిన సహజ గుహల మధ్య ఉంటుంది. ఎనిమిది చేతులతో ఉగ్ర నరసింహ స్వామి హిరణ్య కశిపుని సంహరిస్తూ దర్శనమిస్తారు. అలాగే, నరసింహ స్వామి పక్కన లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.