రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులు మంజూరు

BPT: చుండూరు, ఆలపాడు గ్రామాలను కలిపే రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ నంబర్ 278 వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.50కోట్లు మంజూరు చేసింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు కావడంతో చుండూరు, అలపాడు, పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరుతుంది.