అర్హులైన వారందరికీ సదరం ధ్రువపత్రాలు జారీ

అర్హులైన వారందరికీ సదరం ధ్రువపత్రాలు జారీ

VKB: జిల్లాలో అర్హులైన వారందరికీ సదరం ధ్రువపత్రాలు జారీ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తెలిపారు. నిన్న సదరం శిబిరాల నిర్వహణ, పోర్టల్ అప్‌లోడ్‌పై డీపీఎంలు, ఏపీఎంలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధ్రువపత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను UDID పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని సూచించారు.