ప్రత్యేక రూపంలో వాసవి అమ్మవారు దర్శనం

ATP: శ్రావణమాసం ప్రారంభం నాటి నుంచి అనంతపురం జిల్లాలో అమ్మవారి ఆలయాలు దేదీప్యమానంగా వెలుగుందుతున్నాయి. మంగళవారం కుందుర్పి మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారు భక్తులకు ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి వివిధ రకాల దీపాలతో భక్తులు హారతులు ఇచ్చారు. కోరికలు సిద్ధించాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు భక్తులు తెలిపారు.