ఎస్పీ కార్యాలయంలో వందేమాతరం వేడుకలు
ASR: వందేమాతరం గేయం 150వ ఏడాది వేడుకలు మనందరికీ చారిత్రకమైన సందర్భమని ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. ఈ వేడుకలను శుక్రవారం పాడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ గేయం ద్వారా దేశభక్తిని వ్యక్తం చేయడం మనకు గర్వకారణమైన అనుభవమన్నారు. గేయం ఇచ్చిన స్ఫూర్తితో అన్ని విభాగాల పోలీస్ సిబ్బంది కలిసి పని చేయడం చాలా ముఖ్యమని చెప్పారు.