అద్దంకిలో పోలీసుల విస్తృత తనిఖీలు

ప్రకాశం: అద్దంకి మండలం మంగళవారం రాత్రి ఎస్సై ఖాదర్ భాషా ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్‌లో, సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో రాత్రుల్లో తిరుగుతున్న వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు నేరాలను నియంత్రించేందుకు రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.