సమావేశంలో సౌకర్యాల లేమిపై ఆగ్రహం

సమావేశంలో సౌకర్యాల లేమిపై ఆగ్రహం

GDWL: రాజోలి మండల కేంద్రంలో జరిగిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక సమావేశంలో సౌకర్యాల లేమిపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాన్‌లు ఏర్పాటు చేయకపోవడంతో హాజరైన అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండాకాలం ఉక్కపోతతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఉదయం నుంచే చెమటలు పట్టడంతో కొందరు టవల్స్, చీర కొంగులతో గాలివేసుకుంటూ కనిపించారు.