పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర

పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర

ELR: ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో ఆదివారం రాత్రి నూజివీడు సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, ఆస్తుల చోరీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల సరఫరాకు సంబంధించి సమాచారం తక్షణమే పోలీసులకు అందించాలన్నారు.