పీజీ సెట్‌లో బాపులపాడు విద్యార్థి ప్రతిభ

పీజీ సెట్‌లో బాపులపాడు విద్యార్థి ప్రతిభ

కృష్ణా: బాపులపాడు మండలం హనుమన్ జంక్షన్‌కు చెందిన పుట్టగుంట సతీష్ కుమార్ కుమార్తె పుట్టగుంట అన్విత దేశవ్యాప్తంగా నిర్వహించిన పీజీ-నీట్‌లో 202వ ర్యాంకు సాధించింది. విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి బెస్ట్ అవుట్‌గోయింగ్ స్టూడెంట్‌గా నిలిచిన ఆమె, ఈ సారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుని ప్రాంతానికి గౌరవాన్ని తీసుకొచ్చింది.