VIDEO: వెంటనే బ్రిడ్జి రెయిలింగ్ మరమ్మత్తులు చేపట్టాలి

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలోని SRSP కాలువ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఇల్లంద నుంచి కొత్తపల్లితో పాటు పలు తండాలకు వెళ్లే వాహనాలు ఈ మార్గం గుండా వెళ్తాయి. గత కొన్ని రోజులుగా బ్రిడ్జి రెయిలింగ్ కొంత కూలిపోవడంతో ప్రమాదకర స్థితి నెలకొంది. వాహనాలు కొంచెం అదుపుతప్పితే అంతే సంగతులు అన్నట్లుగా ఉంది. ఈ సమస్య పై అధికారులు తక్షణం మరమ్మత్తులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.