LIC పాలసీదారులకు ALERT
మహావీర్ జయంతి సందర్భంగా ఇవాళ ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, LIC తన శాఖలను యథావిధిగా తెరిచి ఉంచనున్నట్లు ప్రకటించింది. పాలసీదారులు తమ బీమా ప్రీమియంలను సకాలంలో చెల్లించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈరోజు సాధారణ కార్యకలాపాలు కొనసాగుతాయని, ఖాతాదారులు ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని LIC సూచించింది.