సూరమ్మ ప్రాజెక్టు పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్

సూరమ్మ ప్రాజెక్టు పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్

JGL: కథలాపూర్ మండలం కలిగొట గ్రామశివారులో గల సూరమ్మ ప్రాజెక్టు పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. వీలయినంత త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఇంజినీరింగ్ అధికారులతో పనులపై సమీక్షించారు. వచ్చే నెలలో పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఆయన వెంట ఎస్ఈ, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఉన్నారు.