ప్రభుత్వ బడుల్లో యూకేజీ
TG: వచ్చే విద్యా సంవత్సరం(2026-27) నుండి మరో 3,000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ(UKG) తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అర్హత గల పాఠశాలల జాబితాను పంపాలని DEOలను ఆదేశించింది. ఈ నిర్ణయంతో సుమారు 6,000 మందికి ఆయా, ఇన్‌స్ట్రక్టర్లుగా ఉపాధి లభించనుంది. వీరికి నెలకు రూ.6 వేల నుండి రూ.8 వేల గౌరవ వేతనం అందించనున్నారు.