ఉత్సవ కమిటీ కన్వీనర్‌గా మల్లేశ్‌ గౌడ్

ఉత్సవ కమిటీ కన్వీనర్‌గా మల్లేశ్‌ గౌడ్

NLG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 18న నిర్వహించే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా, కట్టంగూర్ మండలం కల్మెరకు చెందిన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్ గౌడ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.