ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు కేంద్రాల ప్రారంభం: కలెక్టర్
MDK: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి 413 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 4.45 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏ గ్రేడ్‌కు రూ.2389, సాధారణ రకానికి రూ.2369గా ధర నిర్ణయించిందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించవద్దన్నారు.