కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: గుడిపాల మండల పరిధిలోని పిల్లారి కుప్పం గ్రామంలో గల శ్రీ ద్రౌపతి ధర్మరాజుల స్వామివారి దేవాలయ కుంభాభిషేకం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ హాజరయ్యారు. ముందుగా ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.