VIDEO: ఎస్సీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో ఎస్సీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. సంఘం గౌరవాధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే దేవా వరప్రసాద్, అధ్యక్షుడిగా శ్యాంబాబు, ప్రధాన కార్యదర్శిగా మహేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న 60 వేల మంది దళితులకు అండగా నిలవాలని సంఘం తీర్మానం చేసింది.