అమరావతిలో భారీ అగ్నిప్రమాదం

అమరావతిలో భారీ అగ్నిప్రమాదం

AP: రాజధాని అమరావతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాయపూడి సమీపంలో మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీకి చెందిన పైపులకు నిప్పంటుకోవడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది, పోలీసులు కలిసి మంటలను అదుపు చేస్తున్నారు. ఇటీవల వెలగపూడిలో ఎల్‌అండ్‌టీ పైపులు కూడా ఇదే తరహాలో కాలిపోవడం గమనార్హం. వరుస ప్రమాదాలతో రాజధాని ప్రాంతంలో ఆందోళన నెలకొంది.