సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
MBNR: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్‌నగర్, హన్వాడ మండలాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ నిధి ఎంతో భరోసానిస్తుందని ఆయన పేర్కొన్నారు.