VIDEO: వాగులో తామర పుష్పాల వేడుక
NRPT: కోస్గి మండలం ముంగిమళ్ల గ్రామంలోని వాగులో విరిసిన తామర పుష్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వేసవిలోనూ వాగు నీటితో కళకళలాడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు, ఈ నీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నట్లు, భూగర్భ జలాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో వాగులు ఎండిపోతున్నా, ఇక్కడ జలకళ కొనసాగడం విశేషం.