దెందేరులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
VZM: కొత్తవలస మండలం దెందేరుగ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంపై ఇంటింటికి వెళ్లి ఆరోగ్య కార్యకర్తలు శుక్రవారం అవగాహన కల్పించారు. కుండిలలో, నీళ్ల ట్యాంకులలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. నీటి నిల్వల వలన లార్వా ద్వారా దోమలు వృద్ధి చెందుతాయని, తద్వారా వ్యాధులు సంక్రమిస్తాయని తెలిపారు.