'విద్యానిధి దరఖాస్తు గడువు పొడిగింపు'

KMM: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి డిగ్రీ పూర్తిచేసిన షెడ్యూల్ కులాల విద్యార్థులకు ప్రభుత్వం అందించే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తుకు గడువు పొడిగించినట్లు ఖమ్మం ఎస్సీ డీడీ సత్యనారాయణ తెలిపారు. ఈ పథకం ద్వారా పది దేశాల్లో చదివేందుకు అవకాశం ఉండగా, అర్హత కలిగిన వారు రూ.20లక్షల ఆర్థిక సాయం కోసం ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.